Hyderabad: భార్య సోదరితో వివాహేతర సంబంధం.. హైదరాబాద్ శివారులో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

wife relatives killed her husband over illegal affair
  • భార్య సోదరితో కలిసి వెళ్లిపోయి తిరిగొచ్చిన భర్త
  • మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన యువతి కుటుంబ సభ్యులు
  • కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి దారుణ హత్య
భార్య సోదరితో వివాహేతర సంబంధం కొసాగిస్తున్న యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు కాళ్లు చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. హైదరాబాద్ శివారులోని కంచన్‌‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందిది.

 పోలీసుల కథనం ప్రకారం.. ముషీరాబాద్‌కు చెందిన కారు డ్రైవర్ సయ్యద్ మునావర్ ఖాద్రి (27), చాంద్రాయణగుట్ట డివిజన్ హఫీజ్‌బాబానగర్ ప్రాంతానికి చెందిన యువతి (25)ని ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప, 24 రోజుల చిన్నారి ఉన్నారు.

అయితే, సయ్యద్‌ తన భార్య సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య, అతడి కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని సయ్యద్ రెండు నెలల క్రితం భార్య సోదరితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పటికీ తన సంబంధాన్ని మాత్రం విడిచిపెట్టలేదు.

దీంతో మాట్లాడుకుందాం రమ్మంటూ యువతి తండ్రి, తమ్ముడు అతడిని ఇంటికి పిలిచారు. ఖాద్రికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరగడంతో యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఖాద్రిని పట్టుకుని కాళ్లు, చేతులను కట్టేశారు. అనంతరం నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి మాంసం కోసే కత్తితో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Chandrayan Gutta
Murder
Crime News

More Telugu News