Kotamreddy Sridhar Reddy: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్

YSRCP MLA Kotamreddy Sridhar Reddy tested corona positive
  • వైద్య పరీక్షలు చేయించుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
  • కరోనా సోకినట్టు వెల్లడి
  • అపోలో ఆసుపత్రిలో చేరిన వైనం
కరోనా వైరస్ భూతం అంతకంతకు విజృంభిస్తోంది. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, రాజకీయనేతలు కూడా దీని బారినపడుతున్నారు. ఏపీలోనూ అందుకు మినహాయింపు కాదు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కరోనా వైద్య పరీక్షలు చేయించుకోగా, వైరస్ సోకినట్టు ఫలితాల్లో వెల్లడైంది.

తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని కోటంరెడ్డి స్వయంగా వెల్లడించారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని, తనకు నెగెటివ్ వచ్చే వరకు దూరంగా ఉండాలని ఆయన తన సన్నిహితులకు, అనుచరులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం కోటంరెడ్డి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Kotamreddy Sridhar Reddy
Corona Virus
Positive
YSRCP

More Telugu News