Karnisena: కంగనాకు మద్దతు పలికిన తెలంగాణ కర్ణిసేన నేతలు... సంజయ్ రౌత్ దిష్టిబొమ్మ దగ్ధం

Telangana Karnisena leaders supports for Kangana Ranaut
  • ముంబయిలో కంగనా వర్సెస్ శివసేన
  • కంగనా కార్యాలయం కూల్చివేసిన మహా సర్కారు
  • కూల్చిన కార్యాలయం తిరిగి నిర్మించాలన్న కర్ణిసేన
జాతీయస్థాయిలో ట్రెండింగ్ లో ఉన్న ఇష్యూ ఏదంటే కంగనా రనౌత్ వ్యవహారమే అని చెప్పాలి. జాతీయ మీడియా మొత్తం కంగనా వర్సెస్ శివసేన అంశంపై ఫోకస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కంగనాకు కర్ణిసేన మద్దతుగా నిలుస్తోంది. తాజాగా, కర్ణిసేన తెలంగాణ విభాగం నేతలు కంగనాకు మద్దతు పలికారు. అంతేకాదు, హైదరాబాద్ బేగం బజారులో కర్ణిసేన కార్యకర్తలు కంగనాకు సపోర్టుగా ఆందోళన నిర్వహించారు.

కంగనా పట్ల అధికార శివసేన, మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కర్ణిసేన నేతలు తీవ్రంగా విమర్శించారు. ఓ మహిళను వేధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనాపై మహా సర్కారు కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముంబయిలో కూల్చివేసిన కంగనా కార్యాలయాన్ని తిరిగి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. కంగనాకు న్యాయం చేయకపోతే కర్ణిసేన దేశవ్యాప్తంగా పోరాటం సాగిస్తుందని నేతలు హెచ్చరించారు. ఈ సందర్భంగా కంగనాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు.
Karnisena
Kangana Ranaut
Telangana
Shiv Sena
Mumbai
Maharashtra

More Telugu News