Witchcraft: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో క్షుద్రపూజల కలకలం

Witchcraft causes huge fears at Naidupeta in Nellore district
  • ఓ వ్యక్తి ఇంటివద్ద పసుపు, కుంకుమతో పూజలు
  • స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంటి యజమాని
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో క్షుద్రపూజల కలకలం రేగింది. స్థానిక పిచ్చిరెడ్డి తోపులోని చిల్లకూరు రవీంద్ర అనే వ్యక్తి ఇంటివద్ద పసుపు, కుంకుమ, బియ్యం, నిమ్మకాయలతో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇవి క్షుద్రపూజలని భావిస్తున్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.

దీనిపై ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎవరైనా భయపెట్టేందుకు ఇలా చేశారా? ప్రత్యర్థులు ఇలా చేయించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఈ క్షుద్రపూజలకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
Witchcraft
Naidupeta
Nellore District
Police

More Telugu News