Kishan Reddy: కంగనా రనౌత్ కు కేంద్రం సెక్యూరిటీ కల్పించడానికి కారణం ఇదే: కిషన్ రెడ్డి

Kanganas father requested for her secutiry says Kishan Reddy
  • కంగనకు రక్షణ కల్పించాలని ఆమె తండ్రి కోరారు
  • ఆమె తండ్రి హిమాచల్ ప్రదేశ్ సీఎంని కలిశారు
  • తన కుమార్తెకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు
శివసేన నేతల నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కేంద్ర హోంశాఖ వై-సెక్యూరిటీని కల్పించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తన కుమార్తెకు ప్రమాదం ఉందని, అందువల్ల ఆమెకు భద్రత కల్పించాలంటూ కంగన తండ్రి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారని... అందుకే కంగనకు భద్రతను కల్పించామని చెప్పారు. కొన్ని సామాజిక అంశాల పట్ల కంగన స్పందిస్తున్నారని... అందువల్ల మహారాష్ట్రలోని కొందరు వ్యక్తులు ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.

కంగన తండ్రి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ని కూడా కలిశారని కిషన్ రెడ్డి చెప్పారు. తన కుమార్తెకు ముప్పు ఉందంటూ వినతిపత్రాన్ని కూడా అందించారని తెలిపారు. ముంబైని పీఓకేతో పోల్చిన తర్వాత కంగనకు తీవ్ర హెచ్చరికలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్ర బలగాలతో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. వై-సెక్యూరిటీ కింద ఆమెకు 24 గంటలూ 10 మంది ఆయుధాలు ధరించిన కమెండోలు రక్షణగా ఉంటారు.
Kishan Reddy
BJP
Kangana Ranaut
Bollywood
Y Security

More Telugu News