Corona Virus: ఏపీ కరోనా హెల్త్ బులెటిన్: ఒక్కరోజులో 77 మంది మృతి, 9999 కొత్త కేసులు

Corona virus looms over the rural areas of Andhra Pradesh
  • 4,779కి పెరిగిన కరోనా మరణాలు
  • తాజాగా 11,069 మంది డిశ్చార్జి
  • 96,191 మందికి కొనసాగుతున్న చికిత్స
ఏపీలో కరోనా వైరస్ అంతకంతకు పాకిపోతోంది. లాక్ డౌన్ కాలంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి వైరస్ అన్ లాక్ మొదలయ్యాక గ్రామీణ ప్రాంతాల్లోనూ కల్లోలం సృష్టిస్తోంది. ఏపీలో సైతం ఇదే తరహా పరిస్థితి నెలకొంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 77 మంది కరోనా ధాటికి బలయ్యారు. కొత్తగా 9,999 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 4,779కి పెరగ్గా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,47,686కి చేరింది.

తాజాగా 11,069 మందికి కరోనా నయం అయిందని ఈ సాయంత్రం విడుదలైన ఆరోగ్యమంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ లో వివరించారు. ఇప్పటివరకు 4,46,716 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 96,191 మంది చికిత్స పొందుతున్నారు.
Corona Virus
Andhra Pradesh
Positive Cases
Deaths

More Telugu News