'అవెంజర్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటి డయానా రిగ్ కన్నుమూత!
- 82 ఏళ్ల వయసులో క్యాన్సర్
- ఆరు నెలల చికిత్స తరువాత మృతి
- సంతాపం తెలిపిన ప్రముఖులు
ఆమె వయసు 82 సంవత్సరాలు. ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను అందుకున్న డయానా రిగ్, ఆరు నెలల క్రితం క్యాన్సర్ బారిన పడి, అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని డయానా ప్రతినిధి సిమాన్ బేర్స్ ఫోర్డ్ వెల్లడించారు. డయానా గురువారం ఉదయం తన కుటుంబసభ్యుల మధ్య ప్రశాంతంగా ఈ లోకాన్ని వీడారని తెలిపారు. డయానా మృతికి హాలీవుడ్ ప్రముఖులు పలువురు సంతాపం తెలిపారు.