Kangana Ranaut: కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసిన బీఎంసీ అధికారులు.. మరోసారి మండిపడిన ఫైర్ బ్రాండ్

BMC staff demolishing Kanganas office
  • రూ. 48 కోట్లతో లగ్జరీ కార్యాలయాన్ని కొనుగోలు చేసిన కంగన
  • సుశాంత్ మరణం తర్వాత శివసేనతో గొడవ
  • ముంబైని పీఓకేగా మరోసారి అభివర్ణించిన కంగన
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన మండిపడింది. 'నా ముంబై ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్' అంటూ మరోసారి ట్విట్టర్ లో కామెంట్ చేసింది. దీంతోపాటు బీఎంసీ సిబ్బంది తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను షేర్ చేసింది.

తాను ఎలాంటి తప్పు చేయలేదని... కానీ ముంబై అనేది మరో పీఓకే అనే విషయాన్ని తన శత్రువులు పదేపదే నిరూపిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బాబర్, అతని సైన్యం' అంటూ కూల్చివేతకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బంది ఫొటోలను షేర్ చేసింది. కంగన ఇటీవలే రూ. 48 కోట్లతో ఈ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. సుశాంత్ మరణం తర్వాత శివసేన నేతలకు, కంగనకు మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, కంగన కార్యాలయాన్ని కూల్చివేశారు. 
Kangana Ranaut
Office
BMC
Bollywood
Demolition

More Telugu News