KCR: జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ వివరణ!

KCR response on National party establishment
  • కేసీఆర్ జాతీయ స్థాయి పార్టీ పెడతారని వార్తలు
  • ఆ వార్తల్లో నిజం లేదని తెలిపిన కేసీఆర్
  • భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేసీఆర్ స్పందిస్తూ, కొత్త పార్టీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైతే దానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ లేదని... జాతీయ పార్టీ ఏర్పాటుపై భవిష్యత్తులో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు దేశాన్ని నాశనం చేశాయని... వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధిస్తుందని కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ సభ్యులెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. పూర్తి సమాచారం, అవగాహనతోనే మాట్లాడాలని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంతో రాష్ట్ర రూపురేఖలు మారుతాయని తెలిపారు.
KCR
TRS
National Party

More Telugu News