SP Balasubrahmanyam: ఆసుపత్రిలో పెళ్లి రోజు జరుపుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం!

SP Balasubrahmanian celebrates his 51 marriage anniversary at Hospital
  • ఐసీయూలో కేక్ కట్‌చేసి సెలబ్రేట్ చేసుకున్న బాలు దంపతులు!
  • నిర్ధారించని ఆసుపత్రి వర్గాలు
  • నేడు శుభవార్త వింటారన్న ఎస్పీ చరణ్
కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆసుపత్రిలోనే తన 51వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం వైద్యుల సమక్షంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బాలు-సావిత్రి దంపతులు తమ పెళ్లి రోజును జరుపుకున్నట్టు సమాచారం. ఐసీయూలోనే వారు కేక్ కట్ చేసినట్టు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఆసుపత్రి వర్గాలు కానీ, బాలు తనయుడు చరణ్ కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.  

కరోనా బారినపడిన బాలసుబ్రహ్మణ్యం గత నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వెంటిలేటర్‌పై ఉంచి, ఎక్మో సాయంతో చికిత్స చేశారు. దీంతో ఆయన ఆరోగ్యం కొంత కుదుటపడింది. ఇటీవల చరణ్ మాట్లాడుతూ.. సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని పేర్కొన్నారు.  
SP Balasubrahmanyam
Chennai
Corona Virus
MGM Hospital
Marriage anniversary

More Telugu News