Vijay Devarakonda: అల్లు అర్జున్ కు రౌడీ బ్రాండ్ దుస్తులు పంపిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda sent Allu Arjun track suit from his Rowdy Brand
  • స్వయంగా ట్రాక్ సూట్ ఎంపిక చేసిన విజయ్
  • థాంక్యూ సో మచ్ అంటూ బన్నీ రిప్లయ్
  • సో స్వీట్ అంటూ కామెంట్స్
టాలీవుడ్ యువ హీరోల్లో అత్యంత వేగంగా స్టార్ డమ్ అందుకోవడం విజయ్ దేవరకొండకే సాధ్యమైంది. తక్కువ సమయంలో విశేష ప్రేక్షకాదరణ పొందారు. విజయ్ తన సినిమాలతోనే కాదు, వ్యక్తిత్వంలోనూ విలక్షణంగా కనిపిస్తుంటారు.

తాజాగా విజయ్ దేవరకొండ... స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఆశ్చర్యానికి గురిచేశారు. తన రౌడీ బ్రాండ్ దుస్తులను అల్లు అర్జున్ కు పంపారు. తన బ్రాండ్ కలెక్షన్ నుంచి స్వయంగా ఎంపిక చేసిన ట్రాక్ సూట్ దుస్తులను బన్నీకి పంపినట్టు విజయ్ సోషల్ మీడియాలో తెలిపారు. బన్నీ అన్నా.. ఈ కలర్ లో నీకు నచ్చుతుందనే పంపిస్తున్నా అంటూ టెలిగ్రామ్ యాప్ లో స్పందించారు. దీనికి బన్నీ వెంటనే రిప్లయ్ ఇచ్చారు. థాంక్యూ సో మచ్ విజయ్... నువ్వెంత మంచివాడివి అంటూ హర్షం వ్యక్తం చేశారు.
Vijay Devarakonda
Allu Arjun
Rowdy Brand
Track Suit
Tollywood

More Telugu News