Pendem Dorababu: కరోనా బారిన పడిన వైసీపీ ఎమ్మెల్యేని హెలికాప్టర్ లో బెంగళూరు తరలించిన కుటుంబ సభ్యులు

Family members shifted corona infected Pendem Dorababu to Bengaluru
  • పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్
  • బెంగళూరులో దొరబాబు బంధువుల ఆసుపత్రి
  • మెరుగైన వైద్య సేవల కోసం బెంగళూరు పయనం
ఏపీలో కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను, రాజకీయనాయకులను సైతం వెంటాడుతోంది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు ఇటీవల కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే, మెరుగైన చికిత్స కోసం దొరబాబును కుటుంబ సభ్యులు బెంగళూరు తరలించారు.

బెంగళూరులో దొరబాబు బంధువులకు చెందిన ఆసుపత్రి ఉండడంతో, అక్కడ ఆయనకు సరైన రీతిలో వైద్య చికిత్స అందుతుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అందుకే ఆయనను ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు తీసుకెళ్లారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి ఈ హెలికాప్టర్ పయనమైంది. హెలికాప్టర్ లో దొరబాబు వెంట భార్య, మరో ఇద్దరు బంధువులు ఉన్నారు.
Pendem Dorababu
Bengaluru
Helicopter
Corona Virus
Positive

More Telugu News