సినీ హీరోయిన్ కంగనాకు క్షమాపణలు చెప్పను: సంజయ్ రౌత్
- కంగనా రనౌత్ మహారాష్ట్రకు క్షమాపణలు చెప్పాలి
- ముంబైని కంగనా రనౌత్ మినీ పాకిస్థాన్ అని పిలిచింది
- అహ్మదాబాద్ గురించి అలా మాట్లాడే ధైర్యం ఉందా?
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి నేపథ్యంలో నెపోటిజంతో పాటు ముంబై పోలీసుల తీరును విమర్శిస్తూ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె ముంబైని పీవోకేతో పోల్చింది. కొన్ని రోజులుగా సంజయ్ రౌత్, కంగనా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కంగనాని పీవోకేకే పంపాలని, ముంబైకి రానివ్వొద్దని సంజయ్ ఇటీవల అనడంతో తాను త్వరలోనే ముంబైకి వస్తానని ఎవరు ఆపుతారో చూస్తానని కంగనా చెప్పింది. దీంతో ఈ విషయంపై మరోసారి స్పందించిన సంజయ్ రౌత్.. కంగనాకు క్షమాపణలు చెప్పబోనని అన్నారు.