దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ శాతం
- ఆగస్టు 23న 57 వేల మంది రికవరీ
- నిన్న ఒక్కరోజే 73 మంది రికవరీ
- ఇప్పటివరకు 31.80 లక్షల మందికి కరోనా నయం
దీనిపై కేంద్రం వర్గాలు స్పందించాయి. కరోనా టెస్టుల సంఖ్యను పెంచడం ద్వారా రోగులను ముందుగానే గుర్తించగలుగుతున్నామని, తద్వారా సత్వరమే వైద్య చికిత్స అందించడం వల్ల రికవరీ రేటు పెరుగుతోందని వెల్లడించాయి. గత పది రోజులుగా రికవరీ శాతంలో పెరుగుదల కనిపిస్తోందని ఇది శుభసంకేతమని తెలిపాయి. ఇప్పటివరకు దేశంలో 41 లక్షల కరోనాకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, 31,80,000 మంది కోలుకున్నారు.