కరోనాను ఓడించడంలో భారత్ ఎందుకు విఫలమైందో మోదీ సమాధానం చెప్పాలి: చిదంబరం
- ఈ నెలాఖరుకు కరోనా కేసులు 55 లక్షలకు చేరుకుంటాయని చెప్పారు
- కానీ అవి 65 లక్షలకు చేరుకుంటాయి
- దీనిపై మోదీ సమాధానం చెప్పాలి
సెప్టెంబర్ 30 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 55 లక్షలకు చేరుతుందని తాను అంచనా వేశానని... అయితే తన అంచనా తప్పు అని చిదంబరం చెప్పారు. సెప్టెంబర్ చివరికి కేసుల సంఖ్య 65 లక్షలకు చేరుకుంటుందని తెలిపారు.
21 రోజుల్లో కరోనాను ఓడిస్తామని ప్రధాని మోదీ చెప్పారని... ఇప్పుడు భారత్ ఎందుకు విఫలమైందో ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలని చిదంబరం డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తిరోగమన వృద్ధిరేటుపై ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వివరణ ఇవ్వాలని అన్నారు.