Andhra Pradesh: సులభతర వాణిజ్యంలో ఏపీ నం.1.. మూడో స్థానంలో తెలంగాణ‌

Andhra Pradesh retains the Number 1 position in State Business Reform Action Plan
  • వ్యాపార సంస్కరణల కార్యాచరణ ర్యాంకుల ప్ర‌క‌ట‌న‌ 
  • ఇంత‌కు ముందు ఏడాది రెండో స్థానంలో తెలంగాణ‌
  • ఏపీ టాప్ లో నిల‌వ‌డానికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌న్న లోకేశ్
రాష్ట్రాల‌ వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019 ర్యాంకుల‌ను ఈ రోజు కేంద్ర ఆర్థికశాఖ ప్ర‌క‌టించింది. సులభతర వాణిజ్యం విభాగంలో ఏపీ త‌న‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. ఇంత‌కు ముందు ఏడాది రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ ఈ సారి మాత్రం ఒక స్థానం దిగ‌జారింది. ఏపీ త‌ర్వాత ఈ సారి రెండో స్థానంలో ఉత్తర ‌ప్రదేశ్ నిలిచింది. తెలంగాణ‌ ఆ త‌ర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.

కాగా, ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో ఏపీ నిలవ‌డానికి త‌న తండ్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడే కార‌ణ‌మ‌ని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. "ఇది చంద్ర‌బాబు గారి క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేత‌త్వానికి ఓ నిద‌ర్శ‌నం. సుల‌భ‌త‌ర వాణిజ్య విధానంలో ఏపీ 2018-19లో మ‌రోసారి టాప్ లో నిలిచింది. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను స‌మ‌ర్థంగా అమ‌లు చేసేందుకు ధ‌న్య‌వాదాలు. చంద్ర‌బాబులా వైఎస్ జ‌గ‌న్ కూడా ఏపీలో మంచి ప‌నుల‌ను చేయాల్సింది.. కానీ చేయ‌క‌పోవ‌డం విచార‌క‌రం" అని లోకేశ్ చెప్పుకొచ్చారు.
Andhra Pradesh
Telangana
Uttar Pradesh
Nara Lokesh
Telugudesam

More Telugu News