Telangana: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి కన్నుమూత

congress senior leader Jagadishwar reddy passes away
  • కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న జగదీశ్వర్‌రెడ్డి
  • రెండుసార్లు ఎమ్మెల్సీగా సేవలు
  • తెలంగాణ తొలి దశ ఉద్యమంలో చురుకైన పాత్ర
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సుంకిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి (72) నిన్న రాత్రి కన్నుమూశారు. గుండెకు స్టెంట్ వేయించుకున్న ఆయన చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో జగదీశ్వర్‌రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున్‌ లకు అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయంలో జైలుకు కూడా వెళ్లారు. వివాద రహితుడిగా పేరున్న జగదీశ్వర్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు.
Telangana
Jagadishwar reddy
Passes away
Congress

More Telugu News