Pawan Kalyan: సినీ జర్నలిస్టులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan thanked cine media persons who wished him on birthday
  • సెప్టెంబరు 2న పుట్టినరోజు జరుపుకున్న పవన్
  • సినీ మీడియాలో అన్ని విభాగాల వారికీ ధన్యవాదాలు తెలిపిన పవన్
  • ప్రత్యేక ప్రకటన విడుదల
సెప్టెంబరు 2న పుట్టినరోజు జరుపుకున్న టాలీవుడ్ అగ్రహీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. తన బర్త్ డే వార్తల కవరేజి ఇస్తూ, కొన్నిరోజులుగా తన గురించి, తన చిత్ర విశేషాల గురించి విస్తృతంగా రాస్తున్న సినీ పాత్రికేయులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సినీ డెస్క్ ఇన్చార్జులు, విలేకరులు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామన్లు, వెబ్ మీడియా నిర్వాహకులు, జర్నలిస్టులు ప్రత్యేక కథనాల ద్వారా గ్రీటింగ్స్ తెలిపారని పవన్ పేర్కొన్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని వివరించారు.
Pawan Kalyan
Journalists
Cine Media
Birthday
Janasena
Tollywood

More Telugu News