భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి.. సాక్ష్యాధారాలు చూపిస్తాం: కళా వెంకట్రావు
- ఇళ్లపట్టాల కార్యక్రమాన్ని సూట్‌కేసు కంపెనీ కుంభకోణంగా మార్చారు
- ఇళ్ల స్థలాల కోసం సేకరించిన 23 వేల ఎకరాల్లో అధిక భాగం వైసీపీ నేతలవే
- మీ పార్టీ వారే కేసులు వేస్తున్నారు
భూకుంభకోణంపై రిటైర్డ్ లేదంటే సిట్టింగ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతిపై సొంతపార్టీ నేతలే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అన్నారు. బలవంతపు భూసేకరణ వల్ల బడుగు, బలహీనవర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 నెలల పాలనలో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు.