Pawan Kalyan: 'వారిని ఆదుకున్నందుకు థ్యాంక్స్‌'.. చెర్రీ, బన్నీతో పాటు పలువురికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు

pawan thanks to cherry
  • కుప్పం దుర్ఘటన బాధిత కుటుంబాలకు సాయం చేశారు
  • మానవతా దృక్పథంతో స్పందించారు
  • దిల్ రాజు, ఏఎమ్ రత్నం, నవీన్ గార్లకు కూడా నా కృతజ్ఞతలు
జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల ఏర్పాట్ల‌ నేపథ్యంలో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ముగ్గురు అభిమానులు క‌రెంట్ షాక్‌తో అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. వారందరి కుటుంబాలను పలువురు సినీ ప్రముఖులు ఆదుకున్నారు. దీంతో వారికి పవన్ కల్యాణ్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

'కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ  రాంచరణ్ కి, అలాగే పెద్దమనసుతో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి, నిర్మాతలు- శ్రీ దిల్ రాజు, శ్రీ  ఏఎమ్ రత్నం, మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు నా కృతజ్ఞతలు' అని పవన్ ట్వీట్ చేశారు.
Pawan Kalyan
Allu Arjun
Ramcharan
Tollywood
Janasena

More Telugu News