Chandrababu: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు?

Senior leader Atchannaidu will be the AP TDP Chief
  • ఏపీ టీడీపీలో చక్కర్లు కొడుతున్న వార్త
  • అచ్చెన్నను నియమించాలంటూ అధినేతను కోరిన నేతలు
  • మరో వారం, పది రోజుల్లో ప్రకటించే అవకాశం
టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా సీనియర్ నేత అచ్చెన్నాయుడిని నియమించే అవకాశం ఉందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలని పలువురు నేతలు అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని సమాచారం. మరో వారం, పది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మండలస్థాయి వరకు పూర్తిచేసిన టీడీపీ.. ఇప్పుడు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. మరో వారం రోజుల్లో ఈ కమిటీలను, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని సమాచారం. అలాగే, రాష్ట్ర కమిటీల నియామకం కూడా పూర్తిచేస్తారని తెలుస్తోంది.
Chandrababu
TDP
Andhra Pradesh
Atchannaidu
Party chief

More Telugu News