Jaqueline Fernandez: మేకప్ లేని ఫొటోను షేర్ చేసి.. తనపై తానే కామెంట్ చేసుకున్న బాలీవుడ్ నటి!

Jaqueline Fernandez shares a photo without makeup
  • మేకప్ లేకుండా జాక్వెలిన్ ఫెర్నాండెజ్
  • మచ్చలు కనిపిస్తున్నాయంటూ కామెంట్
  • ఫొటోకు 10.5 లక్షలకు పైగా లైకులు
బాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. 'సాహో' సినిమాలో ప్రభాస్ సరసన ఒక పాటలో కూడా జాక్వెలిన్ మెరిసింది. తాజాగా మేకప్ లేని ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసింది. 'చిన్న చిన్న మచ్చలు బయటకు కనిపిస్తున్నాయి' అంటూ తనకు తానే కామెంట్ చేసుకుంది. ఈ ఫొటోకు 10.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. మేకప్ లేకుండా కూడా చాలా అందంగా ఉన్నావంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Jaqueline Fernandez
Without Makeup
Bollywood

More Telugu News