Rahul Gandhi: మోదీ వల్ల దేశానికి కలిగిన విపత్తులు ఇవే: జాబితా విడుదల చేసిన రాహుల్ గాంధీ

Rahul tweets the list of Modi made disasters
  • జీడీపీ 23.9 శాతం పతనమైంది
  • 12 కోట్ల ఉద్యోగాలు పోయాయి
  • జీఎస్టీ బకాయిలను రాష్ట్రాలకు చెల్లించడం లేదు 
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ సృష్టించిన విపత్తుల వల్ల దేశం సర్వనాశనం అవుతోందని మండిపడ్డారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జీడీపీ పతనం కావడం పట్ల రాహుల్ స్పందిస్తూ... మోదీ విపత్తులు ఇవేనంటూ ఒక జాబితాను ట్విట్టర్ లో షేర్ చేశారు.

  • రికార్డు స్థాయిలో జీడీపీ 23.9 శాతం పతనం కావడం.
  • 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిన నిరుద్యోగం.
  • 12 కోట్ల ఉద్యోగాలు పోవడం.
  • రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలను చెల్లించకపోవడం.
  • ప్రపంచంలో ఏ దేశంలో నమోదు కాని స్థాయిలో కరోనా కేసులు, మరణాలు సంభవిస్తుండటం.
  • సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు.

మోదీ మన దేశానికి తీసుకొచ్చిన విపత్తులు ఇవని రాహుల్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా నిన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. మానవుడు సృష్టించిన ఈ కరోనా విపత్తును దేవుడి చర్య అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Rahul Gandhi
Congress
Narendra Modi
bjp

More Telugu News