Chandrababu: మిస్టర్ సీఎం.. పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ ను దాటి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది: చంద్రబాబు

AP register 2nd highest number of cases in India says Chandrababu
  • కరోనా కేసుల్లో ఏపీ రెండో స్థానానికి చేరుకుంది
  • మహమ్మారి విస్తరణకు వైసీపీ నేతలే కారణం
  • క్వారంటైన్ చేయడంలో కూడా విఫలమయ్యారు
దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానానికి చేరుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పరిస్థితి భయానకంగా ఉందని చెప్పారు. లిక్కర్ షాపుల ముందు పెద్దపెద్ద క్యూలు ఉంటున్నాయని అన్నారు. కరోనా విస్తరణకు వైసీపీ నేతలే కారణమని ఆరోపించారు. పేషెంట్లను క్వారంటైన్ చేయడంలో సైతం ప్రభుత్వం విఫలమైందని అన్నారు. 'మిస్టర్ సీఎం.. పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ దాటి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది' అని ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Corona Virus

More Telugu News