Pattabhiram: రైతు ఆత్మహత్యల్లో ఏపీకి 3వ స్థానం వచ్చిందంటే జగన్ సర్కారే కారణం: పట్టాభిరామ్

 TDP Spokes person Kommareddy Pattabhiram fires on CM Jagan
  • ఏపీలో 1,029 మంది రైతులు బలవన్మరణం చెందారన్న పట్టాభి
  • జగన్ రైతుకు వెన్నుపోటు పొడిచారని విమర్శలు
  • రైతుల గొంతుకోశారంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సీఎం జగన్ పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ సీఎం అయ్యాక రైతులకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీకి 3వ స్థానం వచ్చిందని అన్నారు. ఏపీలో 1,029 మంది రైతుల ఆత్మహత్యలు బాధాకరమని పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఇంతమంది రైతులు బలవన్మరణం చెందడానికి ఈ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. రైతు భరోసా పథకాన్ని రైతు దగా పథకంగా మార్చారని, రూ.12,500కి బదులు రూ.6,500 మాత్రమే ఇస్తూ రైతుల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pattabhiram
Jagan
Farmers
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News