Pawan Kalyan: పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫొటోను షేర్ చేసిన మహేశ్ బాబు!

Mahesh Babu shares a photo of Pawan Kalyan
  • పుట్టినరోజు సందర్భంగా పవన్ కు శుభాకాంక్షల వెల్లువ
  • మీ దయాగుణం స్ఫూర్తిదాయకమన్న మహేశ్
  • ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన సూపర్ స్టార్
జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రిన్స్ మహేశ్ బాబు కూడా పవన్ కు గ్రీటింగ్స్ చెప్పాడు. 'పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ దయాగుణం, వినయం స్ఫూర్తిదాయకం. మీకు మంచి ఆరోగ్యం, సంతోషం చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశాడు. దీంతో పాటు గతంలో పవన్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. మరోవైపు, పవన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం 'వకీల్ సాబ్' యూనిట్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Pawan Kalyan
Mahesh Babu
Birthday
Tollywood

More Telugu News