Kesineni Nani: కొల్లు రవీంద్రను కావాలనే ఇరికించారు: కేశినేని నాని

Kesineni Nani meets Kollu Ravindra
  • కొల్లు రవీంద్రను పరామర్శించిన కేశినేని నాని
  • రవీంద్ర ఏ తప్పు చేయలేదని వ్యాఖ్య
  • రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపాటు
హత్య కేసులో బెయిల్ పై విడుదలైన టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని ఈరోజు పరామర్శించారు. మంత్రి పేర్ని నాని అనుచరుడు, మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ, రాజకీయ కక్షల్లో భాగంగానే రవీంద్రను ఇరికించారని ఆరోపించారు. రవీంద్ర ఏ తప్పు చేయలేదనే విషయం అందరికీ తెలుసని చెప్పారు. ఆయన ఈ కేసులో నిర్దోషిగా బయటపడతారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి  వచ్చిన తర్వాత విపక్ష నేతలపై కక్ష సాధింపులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఇది ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పారు. కక్ష సాధింపులను పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు.
Kesineni Nani
Kollu Ravindra
Telugudesam

More Telugu News