Andhra Pradesh: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మూడు మద్యం సీసాలు తెచ్చుకోవచ్చు!: ఏపీ హైకోర్టు

ap high court on rit pitition
  • ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చుకోనివ్వకుండా నిలుపుదల 
  • సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
  • జీవో 411 అమలు చేయాలని సర్కారుకి ఆదేశం
ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మద్యాన్ని తెచ్చుకోనివ్వకుండా అడ్డుకుంటుండడంపై దాఖలైన రిట్ పిటిషన్‌పై ఈ రోజు ఏపీ హైకోర్టు తీర్పు ప్రకటించింది. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం సీసాలు తెచ్చుకోవచ్చని తెలిపింది.

కాగా, అక్రమ మద్యాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఏపీలో పోలీసులు, ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు మద్యాన్ని సీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మద్యం ప్రియులు తెచ్చుకునే మద్యాన్ని కూడా అడ్డుకోవడంపై పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. జీవో 411 అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అదేశించింది.
Andhra Pradesh
AP High Court

More Telugu News