Atchannaidu: శ్రీవారి సేవలో అచ్చెన్నాయుడు.. సాదర స్వాగతం పలికిన టీటీడీ అధికారులు

TDP Leader Atchannaidu visits Tirumala
  • ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్ట్
  • ఐదు రోజుల క్రితమే బెయిులుపై విడుదల
  • వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్న అచ్చెన్న
టీడీపీ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై అరెస్ట్ అయిన అచ్చెన్న ఐదు రోజుల క్రితం బెయిలుపై విడుదలయ్యారు. తాజాగా, ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన అచ్చెన్నకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అచ్చెన్నకు అందజేశారు.
Atchannaidu
Tirumala
Tirupati
TTD
TDP

More Telugu News