Chiranjeevi: ముగ్గురు అభిమానులు మరణించటం నా గుండెను కలిచివేసింది: చిరంజీవి

chiranjeevi condolences pawan fans death
  • చిత్తూరులో బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో మృతి
  • వారి  కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి
  • అభిమానులు  ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు
  • మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి
జనసేన అధినేత, సినీనటుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల ఏర్పాట్ల‌ నేపథ్యంలో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప‌వ‌న్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న అభిమానులు పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా, ఆ స‌మ‌యంలో ముగ్గురు అభిమానులు క‌రెంట్ షాక్ తో అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

'చిత్తూరులో పవన్ పుట్టినరోజు సందర్భంగా బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో  ముగ్గురు మరణించటం నా గుండెను కలిచివేసింది. వారి  కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు  ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ, మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వం' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Chiranjeevi
Pawan Kalyan
Tollywood

More Telugu News