ట్విట్టర్ లో చైల్డ్ హుడ్ ఫొటో పోస్టు చేసిన మెగా హీరో

  • బాల్యాన్ని గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్
  • సాయితేజ్ హెయిర్ స్టయిల్ నచ్చుతుందంటూ ట్వీట్
  • నీ గడ్డం నాకు బాగా ఇష్టం అంటూ సాయితేజ్ రిప్లయ్
మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయితేజ్ బావ, బావమరుదులు అవుతారన్న సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్ తమ బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఓ ఫొటో పోస్టు చేశారు. ఆ ఫోటోలో ఉన్న సాయితేజ్ ను ఉద్దేశించి... నీ హెయిర్ స్టయిల్ అంటే నాకు బాగా ఇష్టం సాయితేజ్ అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. దీనికి సాయితేజ్ వెంటనే బదులిచ్చారు. నీ గడ్డం స్టయిల్ నాకు బాగా నచ్చుతుంది అంటూ ట్వీట్ చేశారు. వీరిద్దరి ట్వీట్లను మెగా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Varun Tej
Saitej
Childhood Memories
Mega
Tollywood

More Telugu News