Pawan Kalyan: పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా.. అభిమానులకు సర్ ప్రైజ్ లు!

Surprises to Pawan Kalyan fans tomorrow on his birthday
  • సెప్టెంబర్ రెండున పవన్ కల్యాణ్ జన్మదినం
  • 'వకీల్ సాబ్' నుంచి విశేషం ఉందన్న దిల్ రాజు 
  • క్రిష్ సినిమా నుంచి కూడా అప్ డేట్
  • హరీశ్ శంకర్ సినిమా నుంచి కూడా సర్ ప్రైజ్    
పవన్ కల్యాణ్ అభిమానులకు రేపు.. అంటే సెప్టెంబర్ 2 పండుగ రోజు లాంటిది. ఎందుకంటే, రేపు తమ అభిమాన కథానాయకుడి పుట్టినరోజు. పైగా కొంత కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ పలు సినిమాలలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాలను ప్రకటించారు కూడా.

ఈ నేపథ్యంలో వస్తున్న బర్త్ డే కాబట్టి, దీనికి ఓ ప్రత్యేకత వుందని చెప్పుకోవచ్చు. అందుకే పవన్ తో సినిమాలు నిర్మిస్తున్న దర్శక నిర్మాతలు కూడా కొత్త అనౌన్స్ మెంట్లతో రేపు అభిమానులను ఆనందింపజేయడానికి సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో, పవన్ నిర్మాతల నుంచి రేపు మూడు సర్ ప్రైజ్ లు రానున్నాయి.  

తమ నుంచి రేపు ఉదయం 9.09 నిమిషాలకు ఓ కొత్త కబురు ఉంటుందని దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ ప్రకటించింది. ఈ సంస్థ ప్రస్తుతం పవన్ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చిత్రాన్ని నిర్మిస్తోంది.  

అలాగే, క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించే చిత్రానికి సంబంధించిన ఓ విశేషాన్ని కూడా రేపు వదలనున్నారు. ఈ అనౌన్స్ మెంటును రేపు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఇస్తారట.

ఇక, గతంలో తనతో 'గబ్బర్ సింగ్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన హరీశ్ శంకర్ తో పవన్ ఇప్పుడు ఓ సినిమా చేయనున్న సంగతి విదితమే. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. 'పీఎస్ పీకే 28' గురించి అప్ డేట్ ఉంటుందని ఇటీవలే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. దీని అప్ డేట్ రేపు సాయంత్రం 4.05 నిమిషాలకు వుంటుంది. బహుశా ఈ చిత్రం టైటిల్ని రేపు ప్రకటించవచ్చు.

మరి రేపు ఈ మూడు చిత్ర నిర్మాణ సంస్థలూ ఏ విశేషాలను పవన్ అభిమానులకు అందించనున్నాయో చూడాలి!
Pawan Kalyan
Dil Raju
Hareesh Shankar
Vakeel Saab

More Telugu News