అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు అగ్రనేత గణపతి.. లొంగిపోయేందుకు రంగం సిద్ధం!
- ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, డయాబెటిస్తో బాధపడుతున్న గణపతి
- ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యమం వైపు
- గణపతి తలపై కోటి రూపాయల నజరానా
జగిత్యాల జిల్లాలోని బీర్పూర్కు చెందిన గణపతి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని మొదలుపెట్టారు. అయితే, ఆ తర్వాత నక్సలైటు ఉద్యమంపై ఆకర్షితులై పీపుల్స్‌వార్‌లో చేరారు. 1977లో తొలిసారి ఆయనపై కేసు నమోదైంది. 1990-91లో పీపుల్స్‌వార్‌లో చీలికలు రావడంతో 2005లో ఏర్పడిన మావోయిస్టు పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలంపాటు ఆ పదవిలో కొనసాగిన గణపతి తలకు ప్రభుత్వం కోటి రూపాయల నజరానా కూడా ప్రకటించింది. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న గణపతి స్థానంలో నంబాల కేశవరావును పార్టీ నియమించింది. గణపతికి భార్య విజయ, కుమారుడు వాసుదేవరావు ఉన్నారు.