Sandro: ముఖానికి పుర్రె లుక్కు రావాలని.... చెవులు కోసేసుకున్న వ్యక్తి!

German national cut his ears to look alike skull face
  • జర్మనీలో వింత వ్యక్తి
  • ముఖంపై భయంకరమైన టాటూలతో కనిపించే సాండ్రో
  • త్వరలో ముక్కు తొలగించుకుంటానని వెల్లడి
జర్మనీకి చెందిన 39 ఏళ్ల సాండ్రో అనే వ్యక్తి విపరీత స్వభావం ఉన్నవాడు. ముఖాన్ని పుర్రెలా మార్చుకోవాలని భావించి, ఏకంగా రెండు చెవులను తొలగించుకున్నాడు. ఇప్పటికే పలు టాటూలతో ముఖాన్ని భయంకరంగా మార్చుకున్న సాండ్రో పిచ్చి పరాకాష్ఠకు చేరిందనడానికి నిదర్శనమే ఈ చెవుల తొలగింపు.

దీనికోసం రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాడు. అన్నట్టు... కోసేసిన తన రెండు చెవులను ఇంట్లోనే భద్రపరుచుకున్నాడు. ఇంటా, బయటా ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని, తన ముఖమే తనకు ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని, ఈసారి ముక్కు తీసేయించుకుంటానని ఈ జర్మన్ వ్యక్తి తెలిపాడు. ముఖం పుర్రెలా కనిపించాలంటే ఈ మాత్రం రిస్క్ తప్పనిసరి అని పేర్కొన్నాడు. ఏదేమైనా సోషల్ మీడియాలో సాండ్రో ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Sandro
Ears
Skull Face
Germany
Nose

More Telugu News