Balakrishna: హిందూపురం కోసం అవసరమైతే జగన్‌ను కలుస్తా: బాలకృష్ణ

If needed I will meet Jagan says Balakrishna
  • హిందూపురం అభివృద్ది కోసం ఏం చేయడానికైనా సిద్ధమే
  • ప్రభుత్వం కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇస్తోంది
  • రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేయాలి
హిందూపురం అభివృద్ధి కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఈ విషయంలో అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి కూడా తాను సిద్ధమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు హిందూపురం ప్రభుత్వాసుపత్రిని బాలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి అవసరమైన రూ. 55 లక్షల విలువైన వైద్య పరికరాలను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఓ మోస్తరు విమర్శలు చేశారు. అభివృద్ధి కంటే కూడా ఎక్కువగా కక్ష సాధింపులపైనే దృష్టి సారిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం హయాంలో తెలంగాణ కంటే ఏపీ ఆదాయం ఎక్కువగా ఉండేదని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలసి పని చేస్తేనే రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలసి పని చేయాల్సి ఉందని చెప్పారు.
Balakrishna
Telugudesam
Tollywood
Jagan
YSRCP
Hindupuram

More Telugu News