Tamilisai Soundararajan: మేం యువత... మాకు కరోనా ఏంవస్తుందిలే అనుకోవద్దు: తమిళిసై వార్నింగ్

Telangana governor Tamilisai warns youth do not neglect about corona
  • 45 ఏళ్ల లోపు వారికి వైరస్ ముప్పు ఎక్కువని వెల్లడి
  • వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్న తమిళిసై
  • కరోనా ఎవరికైనా వస్తుందని స్పష్టీకరణ
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్లు కూడా కరోనా బారినపడుతున్నారని తెలిపారు. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లోనూ, పురుషుల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల శాతంలో పెరుగుదల కనిపిస్తోందని వెల్లడించారు. మేం యువత... కరోనా మాకెందుకు వస్తుందిలే అనుకోవద్దు... కరోనా ఎవరికైనా వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను పాటించాలి. కరోనా సోకగానే వీలైనంత తొందరగా వైద్యులను సంప్రదించాలి అని తమిళిసై స్పష్టం చేశారు.

కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో... 60 ఏళ్లు పైబడినవారు జాగ్రత్తగా ఉండాలని, యువతకు వ్యాధి నిరోధక శక్తి మెండుగా ఉండడంతో వారికి ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువని ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల వస్తున్న నివేదికల్లో యువతలోనే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా వస్తున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై హెచ్చరించారు.
Tamilisai Soundararajan
Corona Virus
Positive
Youth
Governor
Telangana

More Telugu News