Pawan Kalyan: మన మాతృభూమి గొప్పదనం ఇదే!: పవన్ కల్యాణ్

Pawan Kalyan heaps praise on a gesture happened in Bengaluru
  • బెంగళూరులో ఇటీవల ఘర్షణలు
  • తీవ్రస్థాయిలో ఆస్తినష్టం
  • మానవహారంలా ఏర్పడి దేవాలయాన్ని కాపాడిన ముస్లింలు
ఇటీవల బెంగళూరులో తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగడం తెలిసిందే. భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగింది. ఓ ఫేస్ బుక్ పోస్టు మతపరమైన విద్వేషాలకు దారితీసింది. అయితే, తాజాగా ఈ అల్లర్ల సందర్భంగా చోటుచేసుకున్న ఓ సుహృద్భావ సంఘటన వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ వైపు అల్లరిమూకలు రోడ్డుపై విధ్వంసం సృష్టించేందుకు ఉరకలు వేస్తుండగా, ముస్లింలు చేయి చేయి కలిపి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఆలయానికి రక్షణగా నిలబడడం ఆ వీడియోలో దర్శనమిచ్చింది. బెంగళూరులోని ఆ హిందూ ఆలయం చుట్టూ ముస్లింలు మానవహారంలా ఏర్పడ్డారు. దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ముస్లింల సౌహార్ద్ర చర్యను స్వాగతిస్తూ, మన మాతృభూమి గొప్పదనం ఇదేనంటూ ట్వీట్ చేశారు.

Pawan Kalyan
Muslims
Temple
Bengaluru
Riots
Video

More Telugu News