Adeep Raj: నూతన్ నాయుడు వైసీపీ మనిషి అని అసత్యప్రచారం చేస్తున్నారు: పెందుర్తి ఎమ్మెల్యే

Pendurthi MLA Adeep Raj responds on Nutan Naidu matter
  • నూతన్ నాయుడితో వైసీపీకి సంబంధం లేదన్న అదీప్ రాజు 
  • నూతన్ నాయుడు జనసేన మనిషి అంటూ వ్యాఖ్యలు
  • పరాన్నజీవి అనే సినిమాకు నూతన్ నాయుడే నిర్మాత అని వెల్లడి

విశాఖ జిల్లా పెందుర్తిలో శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయడంపై స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు స్పందించారు. శ్రీకాంత్ ను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్ నాయుడు వైసీపీకి చెందినవాడని ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవంలేదని స్పష్టం చేశారు. నూతన్ నాయుడికి, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

నూతన్ నాయుడు జనసేనతో సన్నిహితంగా ఉన్నారని, పరాన్నజీవి అనే చిత్రానికి నూతన్ నాయుడే నిర్మాత అని వెల్లడించారు. శిరోముండనం వ్యవహారంలో నూతన్ నాయుడి ప్రమేయం ఉందని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన్ నాయుడు వైసీపీ సిద్ధాంతకర్త అని, తాను వైసీపీ మేనిఫెస్టోలో రూపకల్పనలో పాలుపంచుకున్నానని నూతన్ నాయుడే స్వయంగా చెప్పాడని టీడీపీ నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే.

  • Loading...

More Telugu News