Narendra Modi: బొమ్మల తయారీ కోసం యువత ముందుకు రావాలి: ప్రధాని మోదీ పిలుపు

I urge Team up for Toys modi
  • పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగా తయారు చేయాలి
  • మన కళా నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలి
  • మన  ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలి
  • స్థానిక కళలు, కళాకారులను మరింత ప్రోత్సహించాలి
పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఆయన మన్‌ కీ బాత్‌లో మాట్లాడుతూ... బొమ్మల తయారీ కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన కళా నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని ఆయన అన్నారు. మన కళాకారుల ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక కళలు, కళాకారులను మరింత ప్రోత్సహించాలని చెప్పారు.
 
అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనదని నరేంద్ర మోదీ అన్నారు. మన వేదాల్లోనూ రైతులను గౌరవించే శ్లోకాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కరోనా సంక్షోభం సమయంలో రైతులు కష్టపడి సాగు చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ ఖరీఫ్‌లో గత ఏడాది కంటే ఎక్కువ సాగు చేస్తున్నారని చెప్పారు. ప్రతి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరారు. కేరళ ఓనం పండుగ ఈ రోజు అంతర్జాతీయ ఉత్సవంగా మారుతుందని తెలిపారు.
Narendra Modi
BJP
India
Mann Ki Baat

More Telugu News