China: చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్‌.. 29 మంది మృతి.. ఫొటోలు ఇవిగో

29 dead in collapse of a restaurant in China
  • శాంషీ ప్రావిన్సులో ఘటన
  • శిథిలాల కింద పదుల సంఖ్యలో స్థానికులు
  • ఇప్పటి వరకు 57 మందిని శిథిలాల నుంచి బయటకు
చైనాలోని  శాంషీ ప్రావిన్సులోని ఓ రెస్టారెంట్‌ కుప్పకూలి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో స్థానికులు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగిస్తోన్న సిబ్బంది ఇప్పటి వరకు 57 మందిని శిథిలాల నుంచి బయటకు తీశారు. ఆ రెస్టారెంటులో ఓ పుట్టినరోజు వేడుక జరుగుతున్న సమయంలో రెస్టారెంటు ఒక్కసారిగా కూలింది.

ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శిథిలాల నుంచి బయటకు తీసిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 21 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

               
           
China
restaurant

More Telugu News