జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం
- పంథా చౌక్ చెక్‌పోస్టు పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు
- ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
- అమరుడైన ఓ పోలీసు అధికారి
ఈ క్రమంలో భద్రతా దళాలకు తారసపడిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ పోలీసు అధికారి అమరుడయ్యాడు. కాగా, గత మూడురోజుల్లో ఇప్పటి వరకు 10 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది లొంగిపోయాడు.