Jagan: నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

AP CM Jagan wishes Nagarjuna on his birthday
  • నేడు 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న నాగార్జున
  • ట్విట్టర్ లో స్పందించిన సీఎం జగన్
  • మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్ష
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నేడు 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగార్జునకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సినీ రంగంలో అత్యంత ప్రేక్షకాభిమానం పొందుతున్న హీరోల్లో ఒకరని నాగ్ ను కొనియాడారు. భగవంతుడు నాగార్జునకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలను అందించాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Jagan
Nagarjuna
Wishes
Birthday
Tollywood

More Telugu News