Amit Shah: కోలుకున్న అమిత్ షా.. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్!

Amit Shah recovered
  • ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా
  • అలసట, ఛాతీ నొప్పితో మళ్లీ ఎయిమ్స్ లో చేరిన వైనం
  • ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న ఎయిమ్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని వైద్య బృందం
అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోలుకున్నారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ కానున్నారు. ఇటీవలే కరోనా బారిన పడిన అమిత్ షా గురుగావ్ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 2న మేదాంత నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

అయితే, ఆ తర్వాత ఆయన అలసట, స్వల్ప ఛాతీ నొప్పికి గురయ్యారు. ఈ నెల 18న ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. మరో విషయం ఏమిటంటే, ఆసుపత్రి నుంచే ఆయన తన కార్యకలాపాలను నిర్వహించారు.
Amit Shah
AIIMS
BJP
Health

More Telugu News