Nutan Naidu: నూతన్ నాయుడిని అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాల ఆందోళన

Dalit organisations demands to arrest Nutal Naidu
  • దళిత యువకుడికి శిరోముండనం చేయించిన వైనం
  • మరికొందరితో కలిసి నూతన్ నాయుడి భార్య అరాచకం
  • పెందుర్తి పీఎస్ ఎదుట దళిత సంఘాల ధర్నా
బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఇంట్లో పని చేసిన దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన కలకలం రేపుతోంది. నూతన్ నాయుడి భార్య మరికొందరితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాలు, వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు.

విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మొబైల్ దొంగిలించాడనే ఆరోపణతో శిరోముండనం చేయించిన నూతన్ నాయుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నూతన్ నాయుడికి స్థానిక ఎమ్మెల్యే అండ ఉందని, అందుకే ఆయనను పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. దళిత నేతలు నిర్వహించిన ఆందోళనతో ట్రాఫిక్ జామ్ అయింది.
Nutan Naidu
Bigg Boss
Dalit Organisations

More Telugu News