Chidambaram: ఈ ప్రశ్నకు దైవదూత సమాధానం చెపుతారా?:చిదంబరం

Will messenger of God answer this question asks Chidambaram
  • కరోనా అనేది దేవుడి చర్య అని చెప్పిన నిర్మలా సీతారామన్
  • ఆర్థిక మంత్రి ఏమైనా దైవదూతా?
  • రాష్ట్రాల ఆర్థిక భారం బాధ్యతను కేంద్రం తీసుకోకపోవడం సరికాదు
కరోనా అనేది 'దేవుడి చర్య' అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల జీఎస్టీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడిందని, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయిందని ఆమె అన్నారు. దేవుడి చర్యతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనైందని చెప్పారు. నిర్మల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం విమర్శలు గుప్పించారు. ఆర్థిక మంత్రి ఏమైనా దైవదూతా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా రాకముందు 2017-18, 18-19, 19-20 ఆర్థిక సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటానికి కారణాలేమిటని అడిగారు. ఈ ప్రశ్నకు దైవదూత ఏమైనా సమాధానం ఇస్తారా? అని ప్రశ్నించారు.

జీఎస్టీ బకాయిల వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటును రుణాల ద్వారా పూడ్చుకోవాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించడాన్ని చిదంబరం తప్పుపట్టారు. ఆర్బీఐ విండో కింద రుణాలు తీసుకోవడం అంటే, మార్కెట్ బారోయింగ్ కిందే అర్థమని, ఇది కేవలం పేరు మార్పు తప్ప మరేం కాదని చెప్పారు. దీని వల్ల ఆర్థికభారం రాష్ట్రాలపైనే పడుతుందని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక భారానికి సంబంధించిన బాధ్యతను కేంద్రం తీసుకోకపోవడం సరికాదని చెప్పారు.
Chidambaram
Congress
Nirmala Sitharaman
BJP
Corona Virus

More Telugu News