Vasantha Kumar: కరోనాతో మరణించిన ఎంపీ వసంతకుమార్ మహమ్మారి తీవ్రతను మార్చిలోనే గుర్తించారు... వీడియో వైరల్

Corona deceased MP Vasanthakumar previous video went viral

  • కరోనాతో కన్నుమూసిన కన్యాకుమారి ఎంపీ
  • మార్చి 20న లోక్ సభలో కరోనా గురించి మాట్లాడిన వైనం
  • జాతీయ విపత్తు అని నాడే గుర్తించిన ఎంపీ

కన్యాకుమారి ఎంపీ, కాంగ్రెస్ నేత హెచ్.వసంతకుమార్ కరోనా బారినపడి నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో మార్చి 20న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో వసంతకుమార్ ప్రసంగానికి సంబంధించినది. అప్పటికింకా లాక్ డౌన్ కూడా ప్రకటించలేదు.

ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ ఓ జాతీయ విపత్తు అని పేర్కొన్నారు. కేంద్రం దీనిపై వెంటనే స్పందించాలని, ఈ వైరస్ మహమ్మారి దేశం మొత్తాన్ని దెబ్బతీయగలదని హెచ్చరించారు. ఈ క్రమంలో బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. నిత్యావసరాలకు తీవ్రమైన కొరత వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. కరోనా ప్రభావాన్ని ఎంతో ముందుగానే ఊహించిన వసంతకుమార్ ఆ రక్కసికే బలికావడం బాధాకరం.


  • Loading...

More Telugu News