Jagan: ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా సీఎం జగన్

CM Jagan appointed as Chairman for AP Industrial Corridor Development Authority
  • ఏపీ సీఎం జగన్ కు మరో పదవి
  • ఉపాధ్యక్షుడిగా మేకపాటి గౌతమ్ రెడ్డి
  • ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఏపీ సీఎం జగన్ మరో పదవిని చేపడుతున్నారు. ఇటీవలే ఏపీ సర్కారు ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ అథారిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ అథారిటీకి సీఎం జగన్ చైర్మన్ గా నియమితులయ్యారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 11 మంది ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు సభ్యులుగా కొనసాగుతారు. ఇక ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Jagan
AP CM
Chairman
AP Industrial Corridor Development Authority
Andhra Pradesh

More Telugu News