Viral Videos: రియా ఇంటికెళ్లి వాచ్‌మెన్‌ను తిడుతూ వేధించిన మహిళా జర్నలిస్టు.. తీవ్ర విమర్శలు.. వీడియో వైరల్‌

Republic TV reporter harasses Rhea Chakrabortys building watchmen
  • ఈ కేసు గురించి మాట్లాడాలని వాచ్‌మెన్‌ను అడిగిన జర్నలిస్టు
  • తమకేం తెలియదని చెప్పిన వాచ్‌మెన్‌
  • ఎందుకు తెలియదని ప్రశ్నించిన జర్నలిస్టు
  • అబద్ధాలు చెబుతున్నారని తిట్లు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో ఇంటర్వ్యూ తీసుకుని రేటింగ్స్‌ పెంచుకోవాలని దేశంలోని అన్ని న్యూస్‌ ఛానెళ్లూ తెగ ఆరాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ టీవీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు ముంబైలోని రియా ఉండే ఇంటికి వెళ్లగా వాచ్‌మెన్‌ మీడియాను అనుమతించకుండా గేట్లు వేసేశారు.

దీంతో ఈ కేసు గురించి మాట్లాడాలని, వివరాలు చెప్పాలని ఆ మహిళా జర్నలిస్టు వాచ్‌మెన్‌ను ప్రశ్నించింది. ఈ కేసుతో ఎటువంటి సంబంధమూ లేని వాచ్‌మెన్‌ను ఈ కేసు గురించి చెప్పాలంటూ ఆ జర్నలిస్టు చేసిన వాదనకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మీడియా తీరు ఇలా ఉంటుందంటూ ఆమెపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె వాచ్‌మెన్‌తో వాదనలకు దిగిన తీరు హాస్యాస్పదంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. 'నాకేం తెలియదు?' అంటూ వాచ్‌మన్‌ వాపోతుండగా, 'నీకు ఎందుకు తెలియదు' అంటూ ఆమె వాదించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వాచ్‌మెన్‌ అబద్ధాలు చెబుతున్నారంటూ ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.
Viral Videos
Sushant Singh Rajput

More Telugu News