టిక్ టాక్ కోసం మైక్రోసాఫ్ట్ తో వాల్ మార్ట్ డీల్!
- టిక్ టాక్ యూఎస్ ఆస్తుల కోసం గట్టి పోటీ
- మైక్రోసాఫ్ట్ తో పాటు పోటీ పడుతున్న ఒరాకిల్
- టిక్ టాక్ ను మరింతగా విస్తరిస్తామన్న వాల్ మార్ట్
కాగా, ట్రంప్ సర్కారు ఇటీవల టిక్ టాక్ యాజమాన్య సంస్థ, చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ కు వార్నింగ్ ఇస్తూ, అమెరికా కార్యకలాపాలు విక్రయించాల్సిందేనని, లేకుంటే మాతృసంస్థతో ఒక్క ఆర్థిక లావాదేవీకి కూడా అనుమతించబోమని హెచ్చరించిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ తో కలిసి తాము టిక్ టాక్ ను సొంతం చేసుకుంటే, అమెరికన్ల అంచనాలను అందుకునేలా దాన్ని అభివృద్ధి చేయగలమన్న నమ్మకం ఉందని, యూఎస్ నియంత్రణా సంస్థల నిబంధనలకు అనుగుణంగా సంస్థను నడిపించగలమని తెలుపుతూ వాల్ మార్ట్ ఓ ప్రకటన వెలువరించింది.