Karnataka: కర్ణాటక డ్రగ్స్ కేసు.. సినీ ప్రముఖులకు సంబంధాలు!

Karnataka Actors Musicians Under Scanner For Drug Use
  • రూ. 2.20 లక్షల విలువైన ఎండీఎంకే మాత్రలు స్వాధీనం
  • డ్రగ్స్‌తో సంగీత దర్శకులు, నటుల వ్యాపారం
  • విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ఎన్‌సీబీ
బెంగళూరులోని కల్యాణ్ నగర్‌లో ఉన్న రాయల్ సూట్స్ హోటల్ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 21న రూ. 2.20 లక్షల విలువైన 145 ఎండీఎంకే (మెథిలిన్ డయాక్సీ మెథాపెటమిన్) మాత్రలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా రహమాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ అక్రమ రవాణా వెనక కర్ణాటక చిత్ర పరిశ్రమకు చెందిన సంగీత దర్శకులు, పలువురు నటులు ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు గుర్తించారు. జర్మనీ, ముంబై నుంచి ఆన్‌లైన్ ద్వారా మాదకద్రవ్యాలను వీరు అక్రమంగా కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన సినీ, ఇతర రంగాల ప్రముఖులను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Karnataka
Sandalwood
Actors
Musicians
Drugs
Narcotics Bureau

More Telugu News